హైదరాబాద్, జూలై 28(నమస్తే తెలంగాణ) : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్(టాక్) ఆధ్వర్యంలో లండన్ లో బోనాల పండుగను మంగళవారం అట్టహాసంగా నిర్వహించారు. యూకేలోని అన్నిప్రాంతాల నుంచి సుమారు 2,500 మందికిపైగా ప్రవాస తెలంగాణవాసులు హాజర య్యారు. తొట్టెల ఊరేగింపు, సాంస్కృతిక కా ర్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
టాక్ అధ్యక్షుడు రత్నాకర్ మాట్లాడుతూ తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ సేవలను, రాష్ట్ర సాధన ఉద్యమాన్ని ఈ వేడుకల్లో ప్రవాసులు స్మరించుకున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ఎంపీ సీమా మల్హోత్రా, భారత హై కమిషన్ ప్రతినిధి వివేక్‌కుమార్, మాజీ ఎంపీ వీరేంద్రశర్మ, హౌంస్లౌ నగర మేయర్ రంజిత్, టాక్ ఉపాధ్యక్షులు శుష్మరెడ్డి, సురేశ్, ప్రధాన కార్యదర్శి సుప్రజ, కన్వీనర్లు అశోక్‌గౌడ్, నవీన్ రెడ్డి, అడ్వైజరీ చైర్మన్ మట్టారెడ్డి, వ్యవస్థాపకుడు అనిల్ పాల్గొన్నారు.