KTR | ఆర్మూర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి మొత్తుకునుడు అంతా.. నేను 2009లో రాసిన అఫిడవిట్లో నేను రాసిన దాని గురించే నీకు హోటల్ ఉన్నదని చెబుతున్నడు. నేనే చెప్పిన కదా ఉన్నదని.. నువ్వు చెప్పుడేందన్నారు కేటీఆర్.
రేవంత్ రెడ్డి పెద్ద కొలంబస్ లెక్క.. వాస్కోడిగామా కదా ఏదో కనుక్కున్నట్టు నువ్వేం కనిపెడితివి కొత్తగా.. అఫిడవిట్లో ఉన్నదే నువ్వు చెప్తున్నవ్.. మరి వ్యాపారం చేసుకునుడు తప్పా.. నా భార్య పిల్లలకు కూడా నేను బువ్వ పెట్టాలి కదా.. లేకపోతే వాళ్లు నువ్వు రాజకీయంలా ఏం చేస్తున్నవ్ అని అడుగుతరు.. వాళ్లకు బువ్వ పెట్టనీకి నేను వ్యాపారం బరాబర్ చేస్తా తప్పేందన్నారు కేటీఆర్.
నిజంగా నేను వ్యాపారాన్ని పట్టించుకుంటే నేను ఈ రాజకీయం విడిచిపెట్టి ఓ 10 హాటళ్లు చేస్తుండే ఇప్పటికి.. ఇప్పుడు మూడే హోటళ్లున్నాయి. దానికి ఈయన ఫ్రీ పబ్లిసిటీ ఇచ్చిండు.. చాలా సంతోషం రేవంత్ రెడ్డి నా హోటళ్లకు పబ్లిసిటీ ఇచ్చినందుకు.. నీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని పేర్కొన్నారు కేటీఆర్.
నాకు హోటల్ ఉందని 2009లోనే అఫిడవిట్లో పెట్టాను
రేవంత్ రెడ్డి నాకు హోటల్ ఉంది అంటున్నాడు.. నేనే చెప్పినదాన్ని నువ్వు చెప్పేదేంది? కొలంబస్లాగా!
వాస్కోడిగామా కనుక్కున్నట్లు నువ్వు కొత్తగా కనుక్కున్నదేంది?
– కేటీఆర్ pic.twitter.com/UEyF6nZaeY
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026
ఆర్మూర్ నియోజకవర్గంలో బీజేపీ, కాంగ్రెస్ నుండి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు
గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన కేటీఆర్ pic.twitter.com/D7NMWUGH1b
— Telugu Scribe (@TeluguScribe) October 1, 2026
butterflies | రంగురంగుల సీతాకోకచిలుకలు, వాటర్ బర్డ్స్ సందడి చూశారా..? వీడియో
Dorothy | రానా సమర్పణలో కార్తీక్ సుబ్బరాజు గే లవ్‌స్టోరీ ‘డోరతీ’.. తెలుగు ట్రైలర్ రిలీజ్
Helicopter crash | జింబాబ్వేలో హెలికాప్టర్ కూలి ఏడుగురు మృతి