Ranya Rao | నటి రన్యారావుకు బిగ్ షాక్.. భారీ జరిమానా విధించిన కస్టమ్స్ శాఖ..!
Ranya Rao | బంగారం అక్రమ రవాణా కేసు (Gold smuggling case) లో నిందితురాలిగా ఉన్న నటి (Actress Ranyarao) రన్యారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు రూ.89 కోట్ల జరిమానా విధిస్తూ కస్టమ్స్ శాఖ (Custums department) తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కస్టమ్స్ జాయింట్ కమిషనర్ సందీప్ నోటీస్ ఇచ్చారు.
Ranya Rao : బంగారం అక్రమ రవాణా కేసు (Gold smuggling case) లో నిందితురాలిగా ఉన్న నటి (Actress Ranyarao) రన్యారావుకు బిగ్ షాక్ తగిలింది. ఆమెకు రూ.89 కోట్ల జరిమానా విధిస్తూ కస్టమ్స్ శాఖ (Custums department) తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు కస్టమ్స్ జాయింట్ కమిషనర్ సందీప్ నోటీస్ ఇచ్చారు. దీనికి సంబంధించిన 399 పేజీల దర్యాప్తు నివేదికను విడుదల చేశారు. 2024 మార్చి 7 నుంచి 2025 ఫిబ్రవరి 18 మధ్య రన్యారావు ఆమె సహచరుడు తరుణ్ మరో ముగ్గురితో కలిసి విదేశాల నుంచి 113 కిలోల బంగారాన్ని అక్రమంగా తీసుకొచ్చినట్లు కస్టమ్స్ దర్యాప్తులో తేలింది.
ఈ వ్యవహారం 2025 మార్చి 3న వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని కెంపెగౌడ అంతర్జాతీయ విమానాశ్రయంలో రన్యారావును డీఆర్ఐ అధికారులు అరెస్టు చేశారు. ఆమె వద్ద 14 కిలోల బంగారం గుర్తించినట్లు తెలిపారు. అనంతరం ఈ కేసులో సీఓఎఫ్ఈపీఓఎస్ఏ చట్టం కింద కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తులో రన్యారావుతోపాటు మరో నలుగురి ప్రమేయం ఉన్నట్లు కస్టమ్స్ అధికారులు గుర్తించారు. విదేశాల నుంచి బంగారం తీసుకొచ్చిన వ్యవహారంపై వివరాలను సేకరించారు.
ఈ కేసులో రన్యారావుకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ఆర్థిక నేరాల ప్రత్యేక న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. తాజాగా కస్టమ్స్ శాఖ రూ.89 కోట్ల జరిమానా విధించింది. ఈ పరిణామంపై కర్ణాటక హోంమంత్రి ప్రియాంక్ ఖర్గే స్పందించారు. జరిమానాకు సంబంధించిన పూర్తి వివరాలు తనకు తెలియవని చెప్పారు. సమాచారం తెలుసుకున్న తర్వాత స్పందిస్తానని బెంగళూరులో మీడియాతో చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | తమిళ చిత్ర పరిశ్రమకు రూ.1000 కోట్ల కల నెరవేరేనా … రజనీకాంత్ ‘జైలర్ 2’పై పెరుగుతున్న అంచనాలు!
AP News | కొండను తొలిచేందుకు జిలెటిన్ స్టిక్స్.. ఎగిరిపడ్డ టిప్పర్.. ఐదుగురు దుర్మరణం..!
Sabarimala: 11000 లీటర్ల నెయ్యి అక్రమ తరలింపు.. శబరిమల కేసులో ట్రాన్స్‌పోర్టు కాంట్రాక్టర్ అరెస్టు
Sircilla | సిరిసిల్లలో వైభవంగా శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు.. పద్మావతి అమ్మవారికి ఒడిబియ్యం సమర్పించిన పద్మశాలి సంఘం
KU Faculty Recruitment | కాకతీయ యూనివర్సిటీలో నియామకాలు పూర్తయ్యేనా? 136 ఖాళీలు ఉండగా.. 49 పోస్టులకే గ్రీన్‌సిగ్నల్!
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

