హైదరాబాద్, మార్చి 9 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో మరో రికార్డు సొంతం చేసుకుంది. నమోదైన 4,961 సైబర్ కేసులలో దర్యాప్తు జరిపి బాధితులకు రూ.43.31 కోట్లు రీఫండ్ చేశామని టీజీసీఎస్బీ డీజీ శిఖాగోయెల్ ఓ ప్రకటనలో వెల్లడించారు. నిరుడు డిసెంబర్లో నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్ ద్వారా 4,893 కేసులలో రూ.33.2 కోట్లను బాధితులకు అందించగా శనివారం నిర్వహించిన జాతీయ లోక్‌అదాలత్‌లో ఆ రికార్డును అధిగమించామని వెల్లడించారు.
ఫ్రీజ్ చేసిన నగదును బా ధితులకు అందించడం ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. సైబర్‌నేరాలపై 1930 నంబర్‌కు కాల్ చేయాలని తెలిపారు.