తెలంగాణకు సరిపడా టీకాలు ఇస్తాం : భారత్ బయోటెక్
భారత్ బయోటెక్ | తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ర్ట ప్రజలకు సరిపడా కొవిడ్ టీకాలు ఇస్తామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు

హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు రాష్ర్ట ప్రజలకు సరిపడా కొవిడ్ టీకాలు ఇస్తామని భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు. తాత్కాలిక సచివాలయం బీఆర్కే భవన్లో భారత్ బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కొవాగ్జిన్ టీకాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు భారత్ బయోటెక్ ఎండీతో సమావేశమయ్యాను అని తెలిపారు. అందరికీ ఉచితంగా టీకా ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. ఈ క్రమంలో వీలైనన్నీ ఎక్కువ డోసులు రాష్ర్టానికి ఇవ్వాలని కృష్ణ ఎల్లకు సీఎస్ విజ్ఞప్తి చేశారు. ఇందుకు భారత్ బయోటెక్ ఎండీ సానుకూలంగా స్పందించారు. రాష్ర్టానికి ఎక్కువ టీకాలు ఇస్తామని కృష్ణ ఎల్ల స్పష్టం చేశారు.
రాష్ర్ట వ్యాప్తంగా 18 ఏండ్లు నిండిన ప్రతి ఒక్కరికీ కరోనా టీకా ఉచితంగా ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రజల ప్రాణాల కంటే డబ్బు ముఖ్యం కాదు అని తేల్చిచెప్పారు. వ్యాక్సినేషన్ కోసం దాదాపు రూ. 2,500 కోట్లు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. వ్యాక్సినేషన్ కోసం ఇప్పటికే అధికారులను ఆదేశించామని సీఎం తెలిపారు. ఇప్పటికే భారత్ బయోటెక్ వాక్సినేషన్ తయారీ చేస్తున్నదని, రెడ్డీ ల్యాబ్స్ తో సహా మరికొన్ని సంస్థలు వాక్సినేషన్ తయారీకి ముందుకు వచ్చాయని, కాబట్టి వాక్సినేషన్ విషయంలో ఎలాంటి ఇబ్బంది వుండబోదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
ఇవికూడా చదవండి..
రాష్ట్రంలో కొత్తగా 10,122 కరోనా కేసులు
కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెస్సార్ కన్నుమూత
ఎమ్మెస్సార్ మృతిపట్ల వినోద్ కుమార్ సంతాపం
జై తెలంగాణకు 17 ఏండ్లు
ఊపిరులూదినా.. ప్రాణం నిలువలే!
50 ఏండ్లు పనిచేసిన దవాఖానలో వెంటిలేటర్ దొరక్క వైద్యుడి మృతి
కరోనాకు ‘పొగ’!
ఇంటికి ఎవర్నీ రానివ్వొద్దు!
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

