Telangana | హైదరాబాద్ : రాష్ట్రంలో గత వారం కురిసిన వడగండ్ల వాన( Hailstorm ) కు భారీగా పంట నష్టం( Crop ) జరిగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వడగండ్ల వాన నష్టంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి( CS Shanti Kumari ) మంగళవారం సమీక్ష నిర్వహించారు.
వ్యవసాయ, దాని అనుబంధ, రెవెన్యూ శాఖల అధికారులతో సీఎస్ సమీక్షించారు. ఈ సమీక్షా సమావేశంలో సీఎంవో కార్యదర్శి స్మితా సబర్వాల్ కూడా పాల్గొన్నారు. వడగండ్ల వాన ప్రభావిత జిల్లాల్లో పంట నష్టం, ఇతర నష్టాలపై సమీక్షించారు. పంట నష్టంపై సీఎం కేసీఆర్కు సీఎస్ శాంతి కుమారి నివేదిక అందించనున్నారు.
రాళ్ల వాన ప్రభావంపై ముఖ్యమంత్రి కేసీఆర్( CM KCR ) ప్రత్యేక దృష్టి సారించిన సంగతి తెలిసిందే. బుధవారం లేదా గురువారం రాళ్ల వాన ప్రభావిత జిల్లాల్లో పర్యటనకు సీఎం కేసీఆర్ సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో రాళ్ల వాన వల్ల వాటిల్లిన నష్టం వివరాలను తెప్పించాలని సంబంధిత జిల్లా మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, వ్యవసాయశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ఆ నివేదికలను పరిశీలించి, నిర్ణయం తీసుకుని ఎక్కువ నష్టం వాటిల్లిన జిల్లాలో పర్యటించనున్నారు.