హైదరాబాద్, ఫిబ్రవరి 27(నమస్తే తెలంగాణ): ఇటీవల కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జిగా నియమితులైన మీనాక్షి నటరాజన్ తొలిసారిగా రాష్ర్టానికి రానున్నారు. ఈ మేరకు శుక్రవారం ఉదయం గాంధీభవన్‌కు చేరుకోనున్నారు.
అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు టీపీసీసీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ, ప్రభుత్వ పరిస్థితి, విధానాలపై సమీక్ష నిర్వహించనున్నారు.