హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 28 (నమస్తే తెలంగాణ): సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల సర్వేలో భాగంగా సీఎం రేవంత్‌రెడ్డి కుటుంబ వివరాలను ఎన్యూమరేటర్లు గురువారం నమోదు చేసుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్‌రెడ్డి, కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి వెళ్లి ఎన్యూమరేటర్లతో సర్వే వివరాల నమోదు ప్రక్రియను పూర్తిచేశారు. ఈ సందర్భంగా సీఎం సర్వే పురోగతిని అడిగి తెలుసుకున్నారు.
వీవీఐపీలు, ఐఏఎస్, ఐపీఎస్, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులు కచ్చితంగా సర్వేలో వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు.