హైదరాబాద్, జూన్ 11 (నమస్తే తెలంగాణ): ఈనాడు గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు కుటుంబ సభ్యులను సీఎం రేవంత్‌రెడ్డి పరామర్శించారు. మంగళవారం రామోజీ ఫిల్మ్‌సిటీకి వెళ్లిన ఆయన రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబసభ్యులను పరామర్శించారు. సీఎం వెంట మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మల్రెడ్డి రాంరెడ్డి, మధుసూదన్‌రెడ్డి ఉన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని తెలంగాణ రియల్ ఎస్టేట్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి, సభ్యులు ప్రదీప్ కుమార్‌రెడ్డి, విశ్రాంత ఐఏఎస్ చిత్రా రామచంద్రన్ మర్యాదపూర్వకంగా కలిశారు. రెరా చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని వారికి సీఎం సూచించారు. ఎమ్మెల్సీ తీన్మార్మల్లన్న కూడా సీఎంని మర్యాపూర్వకంగా కలిశారు. అనంతరం ఎంసీఆర్హెచ్ఆర్డీలో శిక్షణ పొందుతున్న తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్-2023 బ్యాచ్ అసిస్టెంట్ కలెక్టర్లతో సీఎం రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారు.