హైదరాబాద్, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ర్టాన్ని అప్పుల ఊబిలోకి దింపుతున్న సీఎం రేవంత్రెడ్డి సర్కారు మరో రూ.1,400 కోట్ల రుణం తీసుకోనున్నది. త్వరలో బహిరంగ మార్కెట్ నుంచి ఈ రుణాన్ని తీసుకునేందుకు ఇండెంట్ పెట్టింది.
ఈ నెల 29న నిర్వహించే ఈ-వేలం ద్వారా రూ.700 కోట్ల చొప్పున ఈ రుణ సమీకరణ చేయనున్నట్టు పేర్కొన్నది. 2025-26 తొలి త్రైమాసికంలో రూ.14 వేల కోట్ల రుణ సమీకరణ కోసం ఆర్బీఐకి ప్రతిపాదనలు పంపిన రేవంత్రెడ్డి సర్కారు.. ఏప్రిల్లో రూ.4 వేల కోట్ల అప్పు తీసుకోనున్నట్టు తెలిపింది. అందులో ఇప్పటికే రూ.3 వేల కోట్లు తీసుకున్నది.