CM Revant Reddy | రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లనున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానంతోనూ చర్చించనున్నారు. అలాగే ప్రధాని నరేంద్రమోదీని కూడా సీఎం రేవంత్ రెడ్డి కలువనున్నారని తెలుస్తున్నది. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీ అపాయింట్ మెంట్ కోరారని సమాచారం. రాష్ట్ర ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఢిల్లీకి వెళ్లినా ప్రధాని మోదీని రేవంత్ రెడ్డి కలువలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.