Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 16వ తేదీన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనుంది. కేబినెట్ భేటీలో ఇరిగేషన్ ప్రాజెక్టు, బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చించనున్నట్లు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై సంధిగ్దం ఏర్పడిన నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. సీఎం రేవంత్ కేబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని ఆయా పార్టీలు వేచి చూస్తున్నాయి.