Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 21వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, ఆయా శాఖల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. రుణమాఫీ, అసెంబ్లీ సమావేశాలు, బడ్జెట్ రూపకల్పన, పంటల బీమాతో పాటు పలు అంశాలపై కేబినెట్లో చర్చించే అవకాశం ఉంది.