హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): ఈ నెల 20న క్యాబినెట్ సమావేశం జరుగనున్నది. సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశాన్ని నిర్వహించనున్నారు.
కొత్త రేషన్‌కార్డుల జారీ, రైతు భరోసా, హైడ్రాకు మరిన్ని అధికారాలు, రూ.2 లక్షలపైన రుణమాఫీకి సంబంధించి విధి విధానాలు తదితర అంశాలపై చర్చించే అవకాశమున్నది.