Telangana Cabinet | హైదరాబాద్ : ఇవాళ జరగాల్సిన తెలంగాణ కేబినెట్ సమావేశం మళ్లీ వాయిదా పడింది. ఈ నెల 15వ తేదీకి వాయిదా పడింది. శనివారం సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ఈ మంత్రివర్గ సమావేశానికి మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు.
వాస్తవానికి తెలంగాణ కేబినెట్ సమావేశం ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉండే. కానీ సమావేశాన్ని 12వ తేదీకి వాయిదా వేశారు. మళ్లీ ఇవాళ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. జూబ్లీహిల్స్ ఫలితం తేలిన మరుసటి రోజున కేబినెట్ సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది కాంగ్రెస్ సర్కార్.