Cabinet Meeting | 3.30కి క్యాబినెట్ భేటీ.. టీఎస్‌ను టీజీగా మార్చనున్న మంత్రిమండలి!
రాష్ట్ర మంత్రిమండలి నేడు భేటీ (Cabinet Meeting) కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ను ప్రస్తుతమున్న టీఎస్‌కు బదులు టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపి కేంద్రానికి సిఫారసు చేయనుంది.
హైదరాబాద్: రాష్ట్ర మంత్రిమండలి నేడు భేటీ (Cabinet Meeting) కానుంది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సెక్రటేరియట్లో మధ్యాహ్నం 3.30 గంటలకు ప్రారంభంకానుంది. ఈ సమావేశంలో వాహనాల రిజిస్ట్రేషన్‌ను ప్రస్తుతమున్న టీఎస్‌కు బదులు టీజీగా మారుస్తూ క్యాబినెట్ ఆమోదం తెలిపి కేంద్రానికి సిఫారసు చేయనుంది. అదేవిధంగా కులగణనుకు ఆమోదం తెలపనుంది. మూసీ అభివృద్ధి, ఐటీ ఎగుమతులు, కొత్త ప్రభుత్వ దవాఖానలు, రాష్ట్రంలో అందుతున్న వైద్యంపై చర్చించనున్నారు. 6 గ్యారెంటీల అమలుకోసం బడ్జెట్ ప్రతిపాదనల్లో ప్రాధాన్యతపై చర్చించనున్నారు.
రైతు భరోసా, కౌలు రైతుల గుర్తింపు, రైతు కూలీ ఆర్థిక సహాయం, మహా లక్ష్మి పథకం, రూ.500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ లబ్దిదారుల గుర్తింపు, అమలుపై చర్చ జరుగనుంది. గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ.50 వేల కోట్ల బడ్జెట్ అవసరమని భావిస్తున్నది. ఇక గ్రూప్-1 నోటిఫికేషన్ విడుదల చేయాలని భావిస్తున్న ప్రభుత్వం.. తుది నిర్ణయం తీసుకోనుంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వాణ తేదీలపై చర్చించనున్నారు. బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ప్రసంగానికి క్యాబినెట్ ఆమోదం, సాగునీటి రంగంపై శ్వేత పత్రం విడుదల చేసే అంశంపై చర్చించనున్నారు. కొడంగల్-నారాయణ పేట ఎత్తిపోతల పథకానికి మంత్రిమండలి ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తున్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

