Ration Cards | హైదరాబాద్ : అసెంబ్లీలోని కమిటీ హాల్లో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ధరణి పేరును భూమాతగా మారుస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. క్రికెటర్ సిరాజ్, బాక్సర్ నిఖత్ జరీన్‌కు గ్రూప్-1 పోస్ట్ డీఎస్పీ ఉద్యోగాలు ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
కొత్త రేషన్ కార్డుల జారీకి కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. కొత్త రేషన్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల రూపకల్పనకు కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన రేషన్ కార్డుల జారీ విధివిధానాల సబ్ కమిటీ ఏర్పాటు కానుంది. రేషన్ కార్డు, ఆరోగ్య శ్రీ కార్డు విడివిడిగా ఇవ్వాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
జీహెచ్ఎంసీలో ఔటర్ గ్రామాల విలీనానికి కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. ఈ కమిటీలో సభ్యులుగా మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, సీతక్క వ్యవహరించనున్నారు.
ఇవి కూడా చదవండి..
TG Rains | తెలంగాణలో రెండురోజులు భారీ వానలు.. ఎల్లో అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ..!
BRS MLA’s Arrest | మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలపై నిరసన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..