BRS MLA’s Arrest | మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలపై నిరసన.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్..
BRS MLA's Arrest | అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం ఛాంబర్ ఎదుట ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు.
BRS MLA’s Arrest | అసెంబ్లీ సాక్షిగా బీఆర్ఎస్ పార్టీకి చెందిన మహిళా ఎమ్మెల్యేలపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసన వ్యక్తం చేశారు. సీఎం ఛాంబర్ ఎదుట ధర్నా చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అరెస్టు చేశారు. మహిళలను అవమానపరిచన సీఎం రేవంత్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. నల్ల బ్యాడ్జీలతో అసెంబ్లీలో వెల్‌లో బైఠాయించగా.. మర్షల్ వారిని అసెంబ్లీ వెలుపలకు తీసుకువచ్చారు. అనంతరం పోలీసులు వాహనంలో అసెంబ్లీ నుంచి తరలించారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, గంగుల కమలాకర్, పద్మారావు గౌడ్‌తో పాటు ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, అనిల్ జాదవ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డితో పాటు పలువురి సభ్యులను అరెస్టు చేశారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. శాసనసభలో విపక్షం గొంతునొక్కారన్నారు. ఎన్నిసార్లు కోరినా స్పీకర్ మైక్ ఇవ్వడం లేదని ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో కూడా ఇన్ని ఆంక్షలు లేవని, తెలంగాణ ఉద్యమంలో లేని ఆంక్షలు శాసనసభలో చూడడం దురదృష్టకరమన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందన్నారు. ముమ్మూటికి ఈ ముఖ్యమంత్రి తెలంగాణ ఆడబిడ్డలకు క్షమాపణలు చెప్పాల్సిందేనని.. అప్పటి వరకు విడిచిపెట్టేది లేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా సీఎం డౌన్ డౌన్ అంటూ కేటీఆర్ నినదించారు. మరోవైపు శాసనసభలో మూడుగంటలుగా నిల్చొని ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, కోవ లక్ష్మి, సునీతా లక్ష్మారెడ్డి నిరసన తెలిపారు. సీఎం క్షమాపణలు చెప్పే వరకు నిరసన కొనసాగిస్తామని బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
Read Also :
-
TG Assembly | ఎస్సీ వర్గీకరణపై ‘సుప్రీం’ తీర్పును స్వాగతిస్తున్నాం.. మాదిగలకు ద్రోహం చేసింది కాంగ్రెస్సే : హరీశ్‌రావు
-
BRS | మహిళా ఎమ్మెల్యేలపై సీఎం వ్యాఖ్యలు.. నిరసనలతో హోరెత్తిన తెలంగాణ
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
DNK Review | ‘దొంగ నా కొడుకు (డీఎన్ కే)’ మూవీ రివ్యూ.. మౌళి కొత్త సినిమా ఎలా ఉందంటే!
Woman Shot Dead In Manipur | కాల్పుల్లో మహిళ మృతి, ఇద్దరికి గాయాలు.. మణిపూర్‌లోని కాంగ్పోక్పి జిల్లాలో బంద్
కృష్ణసాగర్‌లో కేంద్ర ప్రభుత్వ ఆర్థిక పథకాలపై అవగాహన
Army van overturns | అల్లవాడ గేట్ సమీపంలో ఆర్మీ వ్యాన్ బోల్తా..ఎనిమిది మంది జవాన్లకు తీవ్రగాయాలు
Rahul Gandhi: నా ఫోన్ ట్యాప్ చేశారు.. మోదీ చర్చకు రావాలి: రాహుల్ గాంధీ
ట్రెండింగ్ వార్తలు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!

