హైదరాబాద్: బీఆర్ఎస్ మహిళా ఎమ్మెల్యేలను కించపరిచేలా మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కపై తెలంగాణ వ్యాప్తంగా ఆగ్రహ జ్వాలలు వ్యక్తమవుతున్నాయి. మహిళా ఎమ్మెల్యేలకు భేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ (BRS) నాయకులు, కార్యకర్తలు రాష్ట్రవ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. పెద్ద సంఖ్యలో పార్టీ కార్యకర్తలు రోడ్లపై భైటాయించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలతో హోరెత్తించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మలు దహనం చేశారు. అయితే పలుచోట్ల బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దిష్టిబొమ్మలను దహనం చేయకుండా అడ్డుకున్నారు.