BRS | హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ఆదివారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో తెలంగాణ రాష్ట్ర దశాబ్ది వేడుకలు జరగనున్నాయి. మూడురోజుల వేడుకల్లో భాగంగా రెండోరోజైన ఆదివారం ఉదయం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జాతీయ జెండాను ఎగురవేస్తారు. అనంతరం తెలంగాణ భవన్లో నిర్వహించే సమావేశానికి బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరై ప్రసంగిస్తారు. ఈనెల 3న బీఆర్ఎస్ జిల్లా కార్యాలయాల్లో పార్టీ అధ్యక్షులు జాతీయ జెండాను ఎగురవేస్తారు. దవాఖానల్లో పండ్లు, మిఠాయిలు పంచిపెడుతారు.