హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ) : కేంద్రంలో బీసీలకు ప్రత్యేక మంత్రులశాఖ ఏర్పాటు చేయడంతోపాటు, ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ డిమాండ్ చేశారు. తెలంగాణ వి ద్యార్థి జేఏసీ చైర్మన్ వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఢిల్లీలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన ధర్నాలో మాజీమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో 70కోట్ల బీసీ జనాభా ఉన్నా బీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వశాఖ లేకపోవడం దారుణమని మండిపడ్డారు. బీసీలకు సామాజిక న్యాయం దక్కాలంటే మంత్రిత్వశాఖను ఏర్పాటు చేయాలని కోరారు. విద్య ద్వారానే దేశ సమగ్ర అభివృద్ధి సాధ్యమని, విద్యకు ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయించాలని డిమాండ్ చేశారు. వేముల రామకృష్ణ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ స్కీమ్‌ను దేశవ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. ధర్నాలో బీసీ జేఏసీ కన్వీనర్ జాజుల లిం గంగౌడ్, కవుల జగన్నాథం, మాధవ్ తదితరులు పాల్గొన్నారు.
హైదరాబాద్, డిసెంబర్ 17(నమస్తే తెలంగాణ) : బీసీల రిజర్వేషన్ల పెంపు, 50శాతం సీలింగ్ తొలగించాలని కోరుతూ పార్లమెంట్లో తాము ప్రవేశపెట్టిన ప్రైవేట్ బిల్లుకు మద్దతివ్వడంతో పాటు ఆమోదించేందుకు కృషిచేయాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఈమేరకు బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేంద్ర సామాజిక న్యా య సాధికారిత మంత్రి వీరేంద్రకుమార్ ను ఢిల్లీలోని ఆయన కార్యాలయంలో బుధవారం ప్రత్యేకంగా కలిశారు. బీసీల డి మాండ్లపై చర్చించి వినతిపత్రం అందజేశారు. వద్దిరాజు మాట్లాడుతూ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన బిల్లులను కేంద్రానికి పంపినా, ఇప్పటివరకు ఆమోదం లభించలేదని వివరించారు. కేంద్రమే జోక్యం చేసుకొని ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే చట్టబద్ధత కల్పించాలని కోరారు. బీఆర్ఎస్ కూడా మద్దతు తెలిపిందని గుర్తుచేశారు. రిజర్వేషన్లపై త్వరలో ప్రధానితో చర్చిస్తానని మంత్రి హామీ ఇచ్చారని బీసీ నేతలు తెలి పారు. మంత్రిని కలిసిన వారిలో మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీసీ జేఏసీ వరింగ్ చైర్మన్ కృష్ణ, బీసీ విద్యార్థి సంఘం జాతీయ అధ్యక్షుడు విక్రమ్‌గౌడ్, బీసీ జేఏసీ రాష్ట్ర కన్వీనర్ సురేశ్ ఉన్నారు.