బీసీ రిజర్వేషన్ల అంశంపై హైకోర్టు స్టే ఇవ్వడంపై నిరసన వ్యక్తం చేస్తూ ఈ నెల 14న రాష్ట్ర వ్యాప్త బంద్కు పిలుపునిస్తున్నట్టు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఇది బీసీలకు అవమానమని భావిస్తూ ఆందోళలనకు బీసీ సంఘాలన్నీ పిలుపునిస్తున్నట్టు చెప్పారు. విద్యానగర్ బీసీ భవన్లో ఆయన మాట్లాడుతూ అన్యాయాన్ని ఎదిరించేందుకు బీసీలంతా ఏకం కావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.