హైదరాబాద్ సిటీబ్యూరో, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్‌పై పోటీ చేసే అర్హతలేని రేవంత్‌రెడ్డిని రెండుచోట్లా ఓడిస్తామని తెలంగాణ ఆటో మోటార్స్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఏకగ్రీవ తీర్మానం చేసింది. రేవంత్‌ను అసెంబ్లీ మెట్లు కూడా తాకకుండా బుద్ధి చెప్తామని శపథం చేసింది. శుక్రవారం కొడంగల్‌లో జరిగిన ఆటో కార్మికుల సమావేశంలో యూనియన్ నాయకులు బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పట్నం నరేందర్‌రెడ్డికి మద్దతుగా కార్మికవర్గం చేసిన ఏకగ్రీవ తీర్మాన పత్రాన్ని అందించారు.
కార్మికుల సంక్షేమం కోసం దేశంలో ఏ ప్రభుత్వమూ చేయని విధంగా సీఎం కేసీఆర్ పథకాలు తీసుకొచ్చి ఆదుకున్నారని యూనియన్ సభ్యులు చెప్పారు. డ్రైవరన్నలకు ఐదు లక్షల ప్రమాద బీమా, కరోనా కష్టకాలంలో రెండు త్రైమాసికాల వాహన పన్ను రద్దు చేసి కేసీఆర్ అండగా నిలిచారని చెప్పారు. కార్యక్రమంలో పట్నం మహేందర్‌రెడ్డి, యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య, కొడంగల్ నియోజకవర్గ జనరల్ సెక్రటరీ రాజశేఖర్, వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు టీ రాజేందర్‌సింగ్, కామారెడ్డి నాయకులు పాల్గొన్నారు.