మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 09:59:51

మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

మూడో రోజు అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభం

హైద‌రాబాద్ : తెలంగాణ అసెంబ్లీ వ‌ర్షాకాల స‌మావేశాలు మూడో రోజు ప్రారంభ‌మ‌య్యాయి. శాస‌న‌స‌భ‌ను స్పీక‌ర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండ‌లిని చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్ రెడ్డి ప్రారంభించారు. స‌భ ప్రారంభ‌మైన వెంట‌నే స్పీక‌ర్ ప్ర‌శ్నోత్త‌రాల‌ను చేప‌ట్టారు. క‌రోనా నేప‌థ్యంలో ఆరు ప్ర‌శ్న‌ల‌కు మాత్ర‌మే అవ‌కాశం క‌ల్పించ‌నున్నారు. ప్ర‌శ్నోత్త‌రాలు ముగిసిన అనంత‌రం అర‌గంట పాటు జీరో అవ‌ర్ ఉంటుంది. టీ బ్రేక్ అనంత‌రం చారిత్రాత్మ‌క‌మైన రెవెన్యూ చ‌ట్టాన్ని స‌భ‌లో ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. ఆ త‌ర్వాత క‌రోనాపై చ‌ర్చ ప్రారంభించ‌నున్నారు. సభ్యులు మాట్లా‌డిన అనం‌తరం చర్చకు ప్రభుత్వం సమా‌ధానం ఇవ్వ‌నుంది. 


logo