హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం జీరో అవర్ కొనసాగుతోంది. అనంతరం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ చేపట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం కేసీఆర్ సమాధానం ఇవ్వనున్నారు. ద్రవ్య వినిమయ బిల్లు ఆమోదం అనంతరం శాసనసభ సమావేశాలు నిరవధికంగా వాయిదా పడే అవకాశాలున్నట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది.
ఈ నెల 7న అసెంబ్లీలో ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు 2022–23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న సీఎం కేసీఆర్ 91,142 ఉద్యోగాలను భర్తీచేస్తామని ప్రకటించారు. అనంతరం వివిధ పద్దులపై శాసనసభ సుదీర్ఘంగా చర్చ జరిగింది.