హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర శాసనసభ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. అయితే, సోమవారం సమావేశాలను ఏర్పాటుచేసి జనవరి 2వ తేదీకి వాయిదావేసే ఆలోచనతో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. జనవరి 2,3 తేదీల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించి ముగించాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తున్నది. ఈ నెల 29న ఉదయం డిప్యూటీ స్పీకర్ ఎన్నిక ప్రక్రియ, ఆ తర్వాత బీఏసీ సమావేశం నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈ సమావేశాల్లో పది బిల్లులను ఆమోదించుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నది.
వీటిలో పురపాలక శాఖకు సంబంధించిన రెండు బిల్లులు, పంచాయతీరాజ్ శాఖకు చెందిన రెండు, జీఎస్టీ బిల్లు ఒకటి, జీహెచ్ఎంసీకి సంబంధించిన రెండు బిల్లులు, ప్రైవేటు యూనివర్సిటీల బిల్లులు ఉన్నాయి. ప్రభుత్వం వీటిని ఆమోదించుకోవడంతోపాటు 2,3 తేదీల్లో కృష్ణా, గోదావరి నదీ జలాల వినియోగం, ప్రాజెక్టుల అనుమతులపై ప్రత్యేక చర్చ నిర్వహించాలని యోచిస్తున్నది.
ప్రధానంగా పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుపై ఒక రోజంతా చర్చ జరిగే అవకాశం ఉన్నది. సమావేశాలపై గవర్నర్ ఆదేశాలు ఈ నెల 29వ తేదీ నుంచి శాసనసభ, శాసనమండలి సమావేశాలు జరుగుతాయని పేర్కొంటూ గవర్నర్ ఆదేశాలు జారీచేశారు. సోమవారం ఉద యం 10:30 గంటలకు సమావేశాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఈమేరకు జీవో 47,48 విడుదల చేశారు.
అంకారా, డిసెంబర్ 24: లిబియా ఆర్మీ చీఫ్ మహ్మద్ అలీ అహ్మద్ అల్ హద్దద్ విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. మంగళవారం టర్కీ పర్యటన ముగించుకొని, రాజధాని అం కారా నుంచి లిబియాకు వస్తుండగా ఆయన ప్రయాణిస్తున్న విమానం ప్రమా దవశాత్తు కుప్పకూలినట్టు తెలిసింది. ఆయనతోపాటు మరో నలుగురు మృతి చెందినట్టు వార్తలు వెలువడ్డాయి.