Telangana Assembly : గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కంగుతిన్న కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీ సమావేశాల (Telangana Assembly Session) నిర్వహణకు సిద్దమవుతోంది. డిసెంబర్ 29వ తేదీ నుంచి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. సర్పంచ్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పుంజుకోవడంతో పాటు కేసీఆర్ (KCR) ఆదివారం ప్రెస్మీట్లో పాలమూరు – రంగారెడ్డి ప్రాజెక్ట్‌పై కాంగ్రెస్ తీరును ఎండగట్టినందున.. నదీ జలాలు, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలపైన అసెంబ్లీలో ప్రధానంగా చర్చ జరుగనుందని సమచారం.
అంతేకాదు ఎంపీటీసీ, జడ్జీటీసీ ఎన్నికలకు ఎప్పుడు వెళ్లాలి? అనే అంశంపై క్యాబినెట్ చర్చించనుంది. అంతేకాదు PACS ఎన్నిలకపై కూడా అధికార పార్టీ దృష్టి సారించనుంది. అలానే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు ఇస్తామన్న 42 శాతం రిజర్వేషన్లపై కూడా రేవంత్ సర్కార్ చర్చించనుందని వార్తలు వినిపిస్తున్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపు దిశగా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రణాళికలు రచించనుందని టాక్.