TS Assembly Elections Live Updates | తెలంగాణలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పరిధిలో ఎన్నికల పోలింగ్ మొదలైంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు వరకు కొనసాగనున్నది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 4 గంటల వరకు మాత్రమే పోలింగ్ జరుగనున్నది. పోలింగ్‌కు ముందు పోలింగ్ కేంద్రాల్లో సిబ్బంది మాక్ పోలింగ్ నిర్వహించారు.
ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలువగా.. 3,26,18,205 మంది ఓటర్లు వారి భవితవ్యాన్ని నిర్ణయించనున్నారు. రాష్ట్రంలో 1,63,13,268 పురుష ఓటర్లు.. 1,63,02,261 మహిళలు ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 2,676 ట్రాన్స్జెండర్లు, 15,406 సర్వీస్ ఓటర్లు వేయనున్నారు. ఎన్నికలకు ఈసీ 35,655 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఇందులో 12వేల సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించింది. 27,094 వెబ్‌కాస్టింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది.
బీఆర్ఎస్ 56
కాంగ్రెస్ 48
బీజేపీ 10
ఎంఐఎం 5
బీఆర్ఎస్ 68
కాంగ్రెస్ 38
బీజేపీ 5
ఇతరులు 8
తెలంగాణ ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం కాబోతున్నారు. తెలంగాణలో ఎగిరేది గులాబీ జెండానే ఇప్పటికే పలు సర్వేలు తేల్చిచెప్పగా.. ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. బీఆర్ఎస్ 72కి పైగా స్థానాల్లో గెలుస్తుందని సెంటర్ ఫర్ పొలిటికల్ స్టడీస్ (సీపీఎస్) ఎగ్జిట్ పోల్స్‌లో వెల్లడించింది. 43 శాతం మంది ఓటర్లు బీఆర్ఎస్ వెంట ఉన్నారని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 38 శాతం ఓట్లు వచ్చినప్పటికీ.. 36(+or-5) స్థానాలకే పరిమితం కానుంది. ఇక బీజేపీ 1 నుంచి 3 స్థానాల్లో మాత్రమే గెలిచే అవకాశం ఉందని పేర్కొంది. ఇక ఇతరులు 9 మంది వరకు గెలిచే అవకాశం ఉందని తెలిపింది.
26 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉంటుందని సీపీఎస్ పేర్కొంది. 11 నియోజకవర్గాల్లో బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య త్రిముఖ పోరు ఉంటుందని తెలిపింది. 29 నియోజకవర్గాల్లో 3000 కంటే తక్కువ మెజారిటీతోనే బీఆర్ఎస్ గెలుస్తుందని పేర్కొంది. అలాగే కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల్లోనూ గెలుస్తారని తెలిపింది. ఇక కొడంగల్ నుంచి రేవంత్ రెడ్డి, హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్, హుజూర్నగర్ నుంచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గెలుస్తారని తెలిపింది. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, చామకూర మల్లారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ గట్టి పోటీ ఎదుర్కొంటారని పేర్కొంది.
బీఆర్ఎస్ 48-58
కాంగ్రెస్ 49-59
బీజేపీ 05-10
ఎంఐఎం 06-08
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (TS Assembly Elections) పోలింగ్ ముగిసింది (Polling Ended). రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో సాయంత్రం 5 గంటలకు పోలింగ్ ముగిసింది. 5 గంటల లోపు క్యూలైన్లలో నిల్చున్న వారికి మాత్రమే ఓటేసేందుకు అధికారులు అనుమతిస్తున్నారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసిన విషయం తెలిసిందే.
కూసుమంచిలో బీఆర్ఎస్ కార్యకర్తలపై పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వర్గీయులు దాడికి దిగారు. కూసుమంచిలోని ఓ పోలింగ్ కేంద్రంలోకి కార్యకర్తలతో వెళ్లేందుకు పొంగులేటి ప్రయత్నించారు. ఇది గమనించిన కార్యకర్తలు కార్యకర్తలతో కలిసి లోనికి వెళ్లవద్దని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలపైకి కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి దిగారు. కాగా, రంగంలోకి దిగిన పోలీసులు ఇరువర్గాల వారిని చెదరగొట్టారు.
తాజాగా టాలీవుడ్ స్టార్స్ రామ్ చరణ్ – ఉపాసన దంపతులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. అలాగే మహేశ్ బాబు – నమ్రత కూడా జూబ్లీహిల్స్‌లోని జూబ్లీ పబ్లిక్ స్కూల్లో ఓటు వేశారు. ప్రముఖ సీనియర్ నటుడు బ్రహ్మానందం, రాజశేఖర్, రామ్, స్టార్ షెట్లర్ పీవీ సింధు, యాంకర్ అనసూయ భరద్వాజ్ తదితరులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా అంతా తమ విలువైన ఓటును వేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
తెలంగాణలోని 13 నియోజకవర్గాల్లో పోలింగ్ ముగిసింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో గంట ముందుగానే పోలింగ్ జరపాలని ఈసీ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు చెన్నూర్, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వరావుపేట, భద్రాచలంలో పోలింగ్ సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగిసింది. సాయంత్రం 4 గంటల వరకు క్యూలైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అనుమతించనున్నారు.
ఆదిలాబాద్‌లో 62.34 శాతం, భద్రాద్రిలో 58.38 శాతం, హన్మకొండలో 49 శాతం, జగిత్యాలలో 58.64 శాతం, జనగామలో 62.24 శాతం, భూపాలపల్లిలో 64.3 శాతం, గద్వాల్లో 64.45 శాతం, కామారెడ్డిలో 59.06 శాతం, కరీంనగర్లో 56.04 శాతం, ఖమ్మంలో 63.62 శాతం, ఆసిఫాబాద్‌లో 59.62 శాతం, మహబూబాబాద్‌లో 65.05 శాతం, మహబూబ్‌నగర్‌లో 58.89 శాతం, మంచిర్యాలలో 59.16 శాతం, మేడ్చల్‌లో 38.27 శాతం, ములుగులో 67.84 శాతం, నాగర్ కర్నూల్లో 57.52 శాతం, నల్గొండలో 59.98 శాతం, నారాయణపేటలో 57.17 శాతం, నిర్మల్‌లో 60.38 శాతం, నిజామాబాద్‌లో 56.05 శాతం, పెద్దపల్లిలో 59.23 శాతం, సిరిసిల్లలో 56.66 శాతం, రంగారెడ్డిలో 42.43 శాతం, సంగారెడ్డిలో 56.23 శాతం, సిద్దిపేటలో 64.91 శాతం, సూర్యాపేటలో 62.07 శాతం, వికారాబాద్‌లో 57.62 శాతం, వనపర్తిలో 60 శాతం, వరంగల్‌లో 52.28 శాతం, యాదాద్రిలో 64 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ శాతం క్రమంగా పెరుగుతోంది. మధ్యాహ్నం ఒంటిగంట వరకు రాష్ట్రవ్యాప్తంగా 36.68 శాతం మేర పోలింగ్ నమోదవ్వగా.. మధ్యాహ్నం 3 గంటల వరకు 51.89 శాతానికి పెరిగింది. అత్యధికంగా మెదక్ జిల్లాలో 69.33 శాతం పోలింగ్ నమోదుకాగా.. అత్యల్పంగా హైదరాబాద్‌లో 31.17 శాతం పోలింగ్ నమోదైంది.
హర్యానా గవర్నర్, బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ హైదరాబాద్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తాను 1983 నుంచి ఓటు వేస్తున్నానని చెప్పారు. ప్రజాస్వామ్యం మరింత బలోపేతం కావడానికి ఓటింగ్ అనేది చాలా ముఖ్యమని ఆయన అన్నారు.
#WATCH | Haryana Governor Bandaru Dattatreya casts his vote in Hyderabad
"I have always voted since 1983. Voting is very important to further strengthen our democracy."#TelanganaElections pic.twitter.com/yFSEIGRew8
— ANI (@ANI) November 30, 2023
వైఎస్ఆర్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ శర్మిల హైదరాబాద్‌లో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
#WATCH | YSR Telangana Party president YS Sharmila exercised her right to vote in Hyderabad#TelanganaElections pic.twitter.com/POvFEsoTXt
— ANI (@ANI) November 30, 2023
ప్రముఖుడు నటుడు జగపతిబాబు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్ ఫిల్మ్‌నగర్‌లోని కల్చరల్ సెంటర్లో ఆయన తన ఓటు వేశారు.
#WATCH | Telugu actor Jagapathi Babu after casting vote at Film Nagar Cultural Centre polling station in Hyderabad pic.twitter.com/ndkYUmG8rm
— ANI (@ANI) November 30, 2023
ప్రతి ఒక్కరూ తప్పకుండా ఓటు హక్కు వినియోగించుకోవాలని అన్నారు ప్రముఖ సినీ నటుడు విజయ్ దేవరకొండ (Vijay Devarakonda). జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆయన తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు. అనంతరం పోలింగ్ బూత్ బయట మీడియాతో మాట్లాడారు. యువతీ యువకులు ఇళ్ల నుంచి బయటకు వచ్చి తమ విలువైన ఓటును వేయాలని పిలుపునిచ్చారు.
‘పోలింగ్ శాతం కొద్దిగా తక్కువగా ఉందని నేను విన్నాను. ఓటరు ఐడీ ఉన్న యువతీ యువకులందరూ ఇళ్ల నుంచి బయటకు వచ్చి ఓటు వేయాలని నేను అభ్యర్థిస్తున్నాను. గత 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రం ఎంత బాగా అభివృద్ధి అయ్యింది. హైదరాబాద్ నగరం ఎంత కొత్తగా మారింది. లేని నీళ్ళు వచ్చాయ్. కరెంట్ వచ్చింది. అభివృద్ధి కొనసాగాలి.. ప్రశాంతమైన జీవితం గడపాలంటే తప్పకుండా ఓటేయాలి. ఓటేయడానికే ఇవాళ హాలిడే ఇచ్చారు. అందుకని అంతా వచ్చి ఓటేయండి. మీకు నచ్చిన రాజకీయ పార్టీకి ఓటేయండి. నేను మా కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఓటేశాను. మీరూ రండి.. ఓటేయండి’ అంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు.
ఎన్నికల్లో ఓటు వేయడం అనేది మన హక్కు మాత్రమే కాదని, మన బాధ్యత కూడా అని మంచు మనోజ్ అన్నారు. ఓటింగ్ శాతం చాలా తక్కువగా ఉన్నదని, ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ బయటికి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఆయన తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
#WATCH | Actor Manoj Manchu casts his vote in Hyderabad
"It is our right and responsibility to vote. I request people to come out and vote as the voter turnout is already less."#TelanganaAssemblyElections2023 pic.twitter.com/bzF4NXAmxD
— ANI (@ANI) November 30, 2023
హాస్య నటుడు బ్రహ్మానందం అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. హైదరాబాద్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
#WATCH | Actor Brahmanandam leaves from a polling station in Hyderabad after casting his vote
"Please vote," he says #TelanganaElections2023 pic.twitter.com/ycnie2ntHy
— ANI (@ANI) November 30, 2023
తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఓటు ద్వారా మద్దతు తెలియజేయడానికి బీఆర్ఎస్ ఎన్ఆర్ఐ నాయకులు విదేశాల నుంచి వచ్చి మరీ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. బీఆర్ఎస్ బహ్రెయిన్ (BRS Bahrain) శాఖ అధ్యక్షుడు రాధారపు సతీష్ కుమార్ గురువారం జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం సిరికొండ గ్రామంలో కుటుంబసభ్యులతో ఓటు వేశారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిని భారత్ రాష్ట్ర సమితి (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR ) పర్యవేక్షించారు. నగరంలోని పలు పోలింగ్ బూత్ (polling centers)ల వద్దకు వెళ్లి అక్కడున్న అధికారులను ఓటింగ్ తీరు గురించి అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఓటేసేందుకు వచ్చిన ఓటర్లతో కూడా ముచ్చటించారు. ఈ సందర్భంగా ప్రజలంతా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.
Ktr
హైదరాబాద్‌లో అత్యల్పంగా కేవలం 20.79 శాతం పోలింగ్ నమోదవడం ఎన్నికలపై నగర ఓటర్ నిరాసక్తతను వెల్లడిస్తోంది. దాంతో నగర, పట్టణ ప్రాంతాల్లో పోలింగ్ శాతం పెరగాలని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్ రాజ్ అన్నారు. నగర ఓటరు ఇండ్లను వీడి పోలింగ్ కేంద్రాలకు తరలిరావాలని మంత్రి కేటీఆర్ కోరారు.
City Voter
సినీ నటుడు శ్రీకాంత్ జూబ్లీహిల్స్‌లో ఓటు వేశారు. అందుకు సంబంధించిన ఫొటోనూ ట్విటర్ (X) లో షేర్ చేస్తూ ‘దయచేసి మీ ఓటు హక్కును వినియోగించుకోండి’ అనే క్యాప్షన్ ఇచ్చాడు.
#WATCH | Actor Srikanth casts his vote in the Jubilee Hills area of Hyderabad, and says, "Please do cast your vote."#TelanganaElections pic.twitter.com/zhn1q3h4vG
— ANI (@ANI) November 30, 2023
ప్రముఖ దర్శకుడు రాజమౌళి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లో వారు ఓటు వేశారు. దానికి సంబంధించిన ఫొటోను ఆయన ట్విట్టర్ (X) లో షేర్ చేశారు. నేను వేశాను, మీరు వేస్తారా..? అంటే క్యాప్షన్ కూడా ఇచ్చారు.
We did?
DID YOU?
Be a proud voter..💪🏽 🇮🇳 pic.twitter.com/LRy9bdS3HV— rajamouli ss (@ssrajamouli) November 30, 2023
ప్రముఖ సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత ఎంఎం కీరవాణి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లో ఆయన ఓటు వేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు.
#WATCH | Telangana Elections | Jubilee Hills, Hyderabad: After casting his vote Oscar-winning music composer, Padma Shri MM Keeravani says, "...Everyone should utilise their voting power...This is not a holiday." pic.twitter.com/9LgyrQFy1C
— ANI (@ANI) November 30, 2023
సినీ హీరో అల్లు అర్జున్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఓటు వేశారు.
#WATCH | Actor Allu Arjun after casting his vote in Hyderabad's Jubilee Hills area#TelanganaElections2023 pic.twitter.com/YbIrZxo5VM
— ANI (@ANI) November 30, 2023
రాజేంద్రనగరంలోని ఓ పోలింగ్ కేంద్రం సమీపంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కాంగ్రెస్ శ్రేణులు టేబుల్, కుర్చీలు పడేసి, దుర్భాషలాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడికి యత్నించడంతో కలకలం రేగింది. మణికొండలోనూ బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ జరిగింది.
Rnjjjjj
బీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్‌కుమార్ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలోని స్వగ్రామం కొదురుపాకలో ఆయన కుటుంబ సభ్యులతో కలిసి ఓటు వేశారు.
సినీ నటుడు విజయ్ దేవరకొండ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్లో ఆయన ఓటేశాడు.
#WATCH | Actor Vijay Deverakonda arrives at Jubilee Hills Public School in Hyderabad to cast his vote in Telangana Assembly elections pic.twitter.com/BkZmqbsHba
— ANI (@ANI) November 30, 2023
నటుడు రాణా దగ్గుబాటి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ FNCCలో ఆయన ఓటు వేశారు.
#WATCH | Actor Rana Daggubati arrives to cast his vote at FNCC in Hyderabad during Telangana elections pic.twitter.com/pZVtDIxrO1
— ANI (@ANI) November 30, 2023
తెలుగు సినీ హరో రవితేజ తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. జూబ్లిహిల్స్‌లోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆయన ఓటేశారు. అనంతరం తను ఓటేసిన ఫొటోను ట్విటర్ (X) లో షేర్ చేస్తూ.. నేను ఓటేశాను! మీరు కూడా మీ ఓటు హక్కును వినియోగించుకుంటారని ఆశిస్తున్నాను అనే క్యాప్షన్ జతచేశారు.
తెలంగాణలో జరుగుతున్న ప్రజాస్వామ్య పండుగలో అంతా భాగస్వామ్యం కావాలని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ట్విట్టర్ ద్వారా ప్రజలకు సందేశమిచ్చారు.
మీ ఓటు..
పరుగులు పెడుతున్న
తెలంగాణ ప్రగతికి
పునాదిగా నిలవాలి
మీ ఓటు..
తెలంగాణ ఉజ్వల భవితకు
బంగారు బాటలు వేయాలి
మీ ఓటు..
తెలంగాణ రైతుల జీవితాల్లో
వెలుగులు కొనసాగించాలి
మీ ఓటు..
వ్యవసాయ విప్లవానికి
వెన్నుముకగా నిలవాలి
మీ ఓటు..
మహిళల ముఖంలో
చెరగని చిరునవ్వులు నింపాలి
మీ ఓటు..
యువత ఆకాంక్షలను నెరవేర్చే
అవకాశాల అక్షయపాత్ర కావాలి
మీ ఓటు..
సబ్బండ వర్ణాల్లో..
సంతోషాన్ని పదిల పరచాలి
మీ ఓటు..
తెలంగాణ ఆత్మగౌరవ పతాకాన్ని
సమున్నతంగా, సగర్వంగా ఎగరేయాలి
మీ ఓటు..
తెలంగాణ రాష్ట్ర ముఖచిత్రాన్ని
తెలంగాణ ప్రజల బతుకు చిత్రాన్ని
మరింత అందంగా తీర్చిదిద్దాలి
మీ చేతిలోని వజ్రాయుధాన్ని
ఎట్టి పరిస్థితుల్లో వృధాకానివ్వకండి
అందుకే..
ప్రజాస్వామ్య పండుగలో
భాగస్వామ్యం కండి..
అందరూ రండి..!
ప్రతి ఒక్కరూ
“ముచ్చటగా…”
ఓటు హక్కును వినియోగించుకొండి..!!
జై తెలంగాణ
జై భారత్
రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (Chief Electoral Officer) వికాస్ రాజ్ తెలిపారు. అక్కడక్కడా చెదురుమదురు ఘర్షణలు చోటు చేసుకున్నప్పటికీ పోలీసులు అదుపు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (TS Assembly Elections) పోలింగ్ సరళిపై హైదరాబాద్‌లో మీడియాతో ఆయన మాట్లాడారు.
‘కొన్ని చోట్ల స్వల్ప ఘటనలు మినహా రాష్ట్రవ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఓటర్ల నుంచి మంచి స్పందన ఉంది. ఒకటి రెండు చోట్ల ఈవీఎంలలో సమస్యలు తలెత్తడంతో.. కొత్తవి మార్చాం.రూరల్ ఏరియాస్‌లో పోలింగ్ శాతం బాగుంది. అయితే, అర్బన్ ఏరియాల్లో ఇంకా పోలింగ్ శాతం పెరగాలి. వృద్ధులు, దివ్యాంగులు ఓటు హక్కు వినియోగించుకునేందుకు బాగా వస్తున్నారు. ఓటరు కార్డే కాకుండా ఆధార్, పాన్ తదితర 12 గుర్తింపు కార్డులను అనుమతిస్తున్నాం. మధ్యాహ్నం నుంచి పోలింగ్ వేగం పెరుగుతుందని ఆశిస్తున్నాం’ అని ఆయన తెలిపారు.
Ceo Vikas Raj
జూబ్లీహిల్స్ క్లబ్లో భార్య సురేఖతో కలిసి మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. రాష్ట్ర యువత అంతా ఉత్సాహంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
మన భవిష్యత్ మన చేతుల్లోనే ఉందని చాటేది ఓటని ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ అన్నారు. కొండాపూర్ చిరాక్ పబ్లిక్ స్కూల్లోని 375వ పోలింగ్ బూత్‌లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటుహక్కును కుటుంబ సభ్యులతో కలిసి వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనర్ మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధంలాంటిదన్నారు.
నాగార్జునసాగర్ ప్రాజెక్టు డ్రామ్ వద్ద ఇంకా ఉద్రిక్త పరిస్థితి కొనసాగుతున్నది. అర్ధరాత్రి నుంచి డ్యామ్‌పై ఆంధ్రా పోలీసులు తిష్ట వేశారు. 26 గేట్లలో మధ్యలో 13 గేట్ల వద్ద ముళ్ల కంచె, టెంట్లు వేసుకుని పోలీసుల పహారా కాస్తున్నారు. డ్యామ్‌పై ఏపీ వైపు వాహనాలు రాకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. విద్యుత్ ఉత్పత్తి ద్వారా దౌర్జన్యంగా కుడి కాల్వకు అధికారులు నీటిని విడుదల చేసుకున్నారు. 5వ గేట్ ద్వారా గంటకు 500 క్యూసెక్కుల చొప్పున నీటి విడుదల చేస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే రెండు రోజుల్లో డ్యామ్ డెడ్ స్టోరేజ్‌కు చేరుకోనున్నది. దీంతో సాగర్ ఆయకట్టు పరిధిలోని తెలంగాణ రైతాంగం ఆందోళనకు గురవుతున్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. బిట్లతండాలో బీఆర్ఎస్ అభ్యర్థి సునీతా లక్ష్మారెడ్డి కుమారుడు వాకిటి శశిధర్ రెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యక్తర్తలు దాడి చేశారు. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు వెళుతున్న శశిధర్ రెడ్డి కారుపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి తెగబడ్డారు. కాంగ్రెస్ కార్యకర్తల దాడిలో శశిధర్ రెడ్డి కారు అద్దాలు ధ్వంసమయ్యాయి.
జనగామ నియోజకవర్గంలో ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఓటమి భయంతోనే దాడులకు పాల్పడుతున్నాయని బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యానికి మంచి సంకేతం కాదని అన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ కామారెడ్డి నియోజకవర్గంలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన స్వగ్రామం బస్వాపూర్‌లో ఆయన ఓటు వేశారు.
Gampa Govardhan
చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవి శంకర్ కుటుంబసమేతంగా వెళ్లి ఓటు హక్కు వినియోగించుకున్నారు. గంగాధార మండలం బూరుగుపల్లిలో వారు ఓటు వేశారు.
Sunke Ravi Shankar
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు సిద్దిపేటలో తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లాలోని చింతమడక గ్రామంలో సీఎం కేసీఆర్ సతీసమేతంగా వెళ్లి ఓటు వేశారు.
మెదక్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మాదేవేందర్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. మెదక్ జిల్లా రామాయంపేట మండలం, కోనాపూర్ గ్రామంలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఆమె ఓటు వేశారు.
సంగారెడ్డి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ సదాశివపేటలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. తన సతీమణితో కలిసి పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఆయన ఓటు వేశారు.
Chinta Prabhaker
రాష్టవ్యాప్తంగా ఈసారి 17 లక్షల మందికి కొత్తగా ఓటు హక్కు లభించింది. వారిలో హైదరాబాద్ మహానగరంలోనే 8 లక్షల మంది కొత్తగా ఓటరు జాబితాల్లోకి ఎక్కారు. వీరంతా ఈ అసెంబ్లీ ఎన్నికలల్లో తొలిసారి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. కుత్భుల్లాపూర్ నియోజకవర్గంలోని జగద్గిరిగుట్ట పరిధిలో కూడా వందల సంఖ్యలో కొత్త ఓటర్లు తొలి ఓట్లు వేశారు. విజ్ఞాన వర్ధిని పోలింగ్ కేంద్రంలో ఒకే కుటుంబానికి చెందిన తోట అక్షయ్ కుమార్, తోట భరత్‌కుమార్, గర్దాసు పూజిత తొలిసారిగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ కరీంనగర్ నియోజకవర్గంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కూడా ఓటు వేశారు.
కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి శిరీష (#Barrelakka) ఓటు హక్కు వినియోగించుకున్నారు. పెద్దకొత్తపల్లి మండలం మరికల్ గ్రామంలో ఓటు వేశారు. హైకోర్టు ఆదేశాలతో ఆమె బందోబస్తు మధ్య పోలింగ్ కేంద్రానికి వచ్చారు.
Barrelakka
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ మొదలైంది. పలుచోట్ల ఈవీఎంలు మొరాయించడంతో పోలింగ్ ఆలస్యమైంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటుహక్కును వినియోగించుకుంటున్నారు. ఉదయం 11 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా 20.64 శాతం మేర పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు ప్రకటించారు.
మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గంలో మంత్రి హరీశ్‌రావు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఆయన తన సతీమణి, కొడుకుతో కలిసి ఓటు వేశారు.
తెలంగాణ శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి ఓటు వేశారు. పట్టణంలోని ఓ పోలింగ్ కేంద్రంలో తన సతీమణి అరుంధతి, కొడుకు గుత్తా అమిత్‌రెడ్డి, కోడలు అఖిలతో కలిసి ఆయన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
Gutta Sukhender Reddy
వరంగల్ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఓటు హక్కు వినియోంచుకున్నారు. తన స్వగ్రామమైన పర్వతగిరి మండల కేంద్రంలో ఆయన ఓటు వేశారు.
Errabelli
బీఆర్ఎస్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సంగారెడ్డి జిల్లా పోతుల బొగుడలోని ఓ పోలింగ్ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి ఆయన ఓటు వేశారు.
నల్లగొండ జిల్లా కలెక్టర్, ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నల్లగొండ పట్టణంలోని చెన్నకేశవ హైస్కూల్లో ఆయన ఓటు వేశారు.
నల్లగొండలో కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కుటుంబంతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. నల్లగొండ పబ్లిక్ స్కూల్లో ఆయన ఓటు వేశారు.