Telangana Assembly Elections | ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అనిల్ జాదవ్ గెలుపొందారు. 23,023 ఓట్ల మెజారిటీతో బీజేపీ అభ్యర్థి సోయం బాపురావుపై గెలుపొందారు. అనిల్ జాదవ్‌కు మొత్తం 76,297 ఓట్లు పోలవగా.. బీజేపీ అభ్యర్థి బాపురావుకు 53,274 ఓట్లు వచ్చాయి. ఇక కాంగ్రెస్ అభ్యర్థి ఆడే గజేందర్ 32,426 ఓట్లతో మూడోస్థానంలో నిలిచారు.