గ్యారంటీ ఇస్తే.. అదనపు నీళ్లిస్తాం
నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలంటే తగిన గ్యారంటీ ఇవ్వాలని ఏపీకి తెలంగాణ తేల్చిచెప్పింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని గురువారం జలసౌధ నుంచి వర్చువల్‌గా నిర్వహించారు
కేఆర్ఎంబీ త్రిసభ్య కమిటీ భేటీలో ఏపీకి తేల్చిచెప్పిన తెలంగాణ
హైదరాబాద్, మార్చి10 : నాగార్జునసాగర్ నుంచి నీళ్లు ఇవ్వాలంటే తగిన గ్యారంటీ ఇవ్వాలని ఏపీకి తెలంగాణ తేల్చిచెప్పింది. కృష్ణానదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశాన్ని గురువారం జలసౌధ నుంచి వర్చువల్‌గా నిర్వహించారు. సమావేశంలో తెలంగాణ ఈఎన్సీ మురళీధర్, ఏపీ జలవనరులశాఖ సీఈ మురళీనాథ్ పాల్గొన్నారు. నాగార్జునసాగర్ వద్ద నీటి వినియోగంపై చర్చించారు. కృష్ణా జలాల వాటాలో ప్రస్తుతం తెలంగాణకు 92 టీఎంసీలు, ఏపీకి 20 టీఎంసీల కంటే తక్కువగా వినియోగించుకొనే అవకాశం ఉన్నది. ఏపీ ప్రభుత్వం 39 టీఎంసీలు కావాలని కోరింది. దీనిని తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ తిరస్కరించారు. ఏటా ఏపీ ఇదే రీతిన వ్యవహరిస్తున్నదని, తెలంగాణకు క్యారీ ఓవర్ నీళ్లను వాడుకొనేందుకు ఒప్పుకోవడం లేదని ఆక్షేపించారు. క్యారీ ఓవర్ ప్రతిపాదికన జలాల వినియోగానికి ఏపీ కచ్చితమైన హామీ ఇవ్వాలని, ఆ తరువాతే అదనపు జలాల వినియోగానికి అంగీకరిస్తామని ఈఎన్సీ మురళీధర్ తేల్చిచెప్పారు. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించాల్సి ఉంటుందని ఏపీ అధికారి చెప్పడంతో సమావేశం అక్కడితో ముగిసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
Newzealand Cricket | టీమిండియాతో వన్డే సిరీస్.. న్యూజిలాండ్ విధ్వంసక ఓపెనర్లకు పిలుపు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

