KTR | భారత్‌కే ఈ రోజు తెలంగాణ ఓ దిక్సూచిగా మారిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. తెలంగాణ భవన్లో ఆదివారం జహీరాబాద్ మెడికల్ విద్యార్థులతో నిర్వహించిన కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడారు. మాజీ మంత్రి హరీశ్‌రావు పూర్వ మెదక్ జిల్లాను రాష్ట్రంలో వైద్య ఆరోగ్యరంగాన్ని అద్భుతంగా ముందుకు తీసుకెళ్లారన్నారు. నిజంగా అమ్మాయిలు మాట్లాడుతుంటే వాళ్ల తల్లిదండ్రుల కన్నుల్లో నీళ్ళు తిరుగుతున్నాయని.. పిల్లలు ప్రయోజకులైనప్పుడు తల్లిదండ్రులు చాలా సంతోషిస్తారన్నారు. అంతకు మించిన ఆనందం తల్లిదండ్రులకు ఉండదని.. అందులో కేసీఆర్ పాత్ర ఉన్నందుకు మేము ఎంతో సంతోష పడుతున్నామన్నారు.
ఒక జహీరాబాద్ నుండి 16 మంది ఎంబీబీఎస్ సీట్లు సాధించారని.. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో మంది డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, సైంటిస్టులు అవుతున్నారన్నారు. తెలంగాణ అనేది ధాన్యం ఉత్పత్తిలోనే నెంబర్ వన్ కాదు.. డాక్టర్ల ఉత్పత్తిలో కూడా నెంబర్ వన్‌గా నిలుస్తుందన్నారు. ఆ ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. మైనార్టీ గురుకుల ఏర్పాటు చేసేటప్పుడు కేసీఆర్ అన్నారని.. 100 గురుకులాలు ఏర్పాటు చేస్తున్నామని.. మైనార్టీలకు, మైనార్టీ అమ్మాయిలు చదువుకోరు అనరని.. కేసీఆర్ ఎప్పుడూ ఏ తల్లి తండ్రి అయిన ఆడపిల్లని చదివించడానికి కులమతాలని చూడరన్నారు. మంచిది వసతులు కల్పిస్తే చదివిస్తారని అన్నారు. 24 మైనార్టీ గురుకుల పాఠశాలలను కేసీఆర్ కేసీఆర్ నిర్మించారని.. అందులో 100 మైనార్టీ గురుకులాలను ఆడబిడ్డల కోసం నిర్మించారన్నారు.
రైతు కుమార్తె, జర్నలిస్టు కుమార్తె, ఆటో డ్రైవర్ కుమార్తె ఎంబీబీఎస్ సీట్లు సాధించడం గర్వకారణమన్నారు. ఇక్కడ ఎంబీబీఎస్ సీటు చదివించిన మీ అందరితో నా విన్నపమని.. ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. పేద విద్యార్థులకు సహాయం చేయాలని.. వారు కూడా ఉన్నత స్థాయికి వచ్చే విధంగా కృషి చేయాలని కోరారు. గవర్నమెంట్, మీ తల్లిదండ్రులే ఈ స్థాయికి తెచ్చిందని.. కేసీఆర్ నాయకత్వంలో హరీశ్‌రావు నాలుగు మెడికల్ కాలేజ్‌లను 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీలుగా పెంచారని.. ఈరోజు తెలంగాణ భారతదేశానికి ఒక దిక్సూచిగా మారిందన్నారు. రాజకీయాల్లోకి వెళ్లిపోవటం సహజమని.. మనం చేసిన మంచి పని వల్ల ఎవరికైనా మంచి జరుగుతే ఆ సంతోష చాలా గొప్పగా ఉంటుందన్నారు. విద్యార్థులంతా తల్లిదండ్రుల పేర్లు, తెలంగాణ రాష్ట్రం పేరును నిలబెట్టాలని పిలుపునిచ్చారు కేటీఆర్.