హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): త్వరలో అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, మధ్యప్రదేశ్, మిజోరం రాష్ర్టాల పోలీస్ ఉన్నతాధికారులకు కేంద్ర ఎన్నికల సంఘం నుంచి పిలుపు అం దింది. తెలంగాణ నుంచి లా అండ్ ఆర్డర్ ఏడీజీ సంజయ్‌కుమార్ జైన్, సీఐడీ విభాగం ఏడీజీ మహేశ్ భగవత్ శుక్రవారం ఢిల్లీకి వెళ్లనున్నారు.
తెలంగాణ నోడల్ ఆఫీసర్‌గా ఉన్న ఏడీజీ సంజయ్ జైన్ సమస్యాత్మక ప్రాంతాల ప్రజెంటేషన్‌తోపాటు, ఫోర్స్ వివరాలను కేంద్ర ఎన్నికల సంఘానికి వివరించనున్నట్టు తెలిసింది. ఎక్స్పెండేచరీ మేనేజ్మెంట్పై సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ వివరించనున్నట్టు సమాచారం.ఎన్నిక సందర్భంగా దొరికే మద్యం, డబ్బులు వంటి విషయాలను భగవత్ కేంద్రానికి నివేదిక రూపంలో అందిస్తారు.