హైదరాబాద్ : నగరంలోని బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బైక్పై వెళ్తూ ఇద్దరు యువకులు డివైడర్ను ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందగా.. మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. అయితే, ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తున్నది. గాయపడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నది. మృతుడికి సంబంధించిన వివరాలు తెలియరాలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉన్నది.