మాగనూరు, ఆగస్టు 7 : ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు గుప్తనిధుల వేటకు పాల్పడుతూ పోలీసులకు దొరికిన ఘటన జోగుళాంబ గద్వాల జిల్లాలో చోటు చేసుకున్నది. మాగనూరు మండలం ఉజ్జల్లి ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయుడు సాయిబాబా.. నాగర్కర్నూల్ జిల్లాకు సంబంధించిన కొందరు ముఠాసభ్యులతో కలిసి గుప్తనిధులవేటను ప్రారంభించాడు. అప్పటికే మాటువేసిన పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు.
నారాయణపేట జిల్లా ఉజ్జల్లి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడు సాయిబాబా హస్తం ఉన్నట్టు గుర్తించారు. ముఠా సభ్యులతోపాటు ఉపాధ్యాయుడిని అరెస్టు చేసి చంచల్గూడ జైలుకు తరలించారు. సదరు ఉపాధ్యాయుడు సమాచారం ఇవ్వకుండా పాఠశాలకు రాకపోవడంవతో వారం క్రితమే సస్పెండ్ చేసినట్టు పేట డీఈవో గోవిందరాజులు తెలిపారు.