గోదావరిఖని, మార్చి 25: సింగరేణిలో మెడికల్ బోర్డు కారుణ్య నియామకాల ఎత్తివేతకు కాంగ్రెస్ ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని టీబీజీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి ఆరోపించారు. బుధవారం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో మీడియాతో ఆయన మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు సీఎంగా ఉన్న టైంలో స్వచ్ఛంద ఉద్యోగ విరమణ (గోల్డెన్ హ్యాండ్‌షేక్) పేరుతో 20వేల మందిని ఇంటిదారి పట్టించారని, గైర్హాజరు పేరుతో మరో 10 వేలమంది కార్మికులను డిస్మిస్ చేశారని గుర్తుచేశారు. అదే పద్ధతిలో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కారుణ్య నియామకాలకు చెల్లుచీటు చెప్పడానికి ప్రయత్నిస్తున్నదని, ఈ క్రమంలోనే ఏసీబీ, విజిలెన్స్ విచారణ పేరిట వేధింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు.