అయిజ, మార్చి 21: వేసవిని దృష్టిలో ఉంచుకొని కర్ణాటక, ఏపీ, తెలంగాణలోని తుంగభద్ర నదీతీర ప్రాంతాల ప్రజలు, పశుపక్షాదులకు తాగునీటి అవసరాల కోసం టీబీ బోర్డు అధికారులు నీటిని విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కర్నూల్ జిల్లాలోని కేసీ కెనాల్ ఇండెంట్లో భాగంగా మిగిలిన 4.7 టీఎంసీలు విడుదల చేయాలని టీబీ బోర్డును ఏపీ జలవనరుల శాఖ కోరింది.
దీంతో 3 రోజులు 5వేల క్యూసెక్కుల చొప్పున, 14 రోజులు 3 వేల క్యూసెక్కుల చొప్పున.. ఈ నెల 20 నుంచి ఏప్రిల్ 5 వరకు నీటిని విడుదల చేయనున్నారు. టీబీ డ్యాం, స్లూయిస్ నుంచి 3,500 క్యూసెక్కులు, గుండ్లకేరి ఎస్కేప్ల నుంచి 1,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.