టూరిస్ట్ బస్సులపై పన్ను!
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న టూరిస్ట్ వాహనాల పన్ను విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది.
- కొత్త విధానానికి రంగం సిద్ధం
- ఏపీ తరహాలో ఇక్కడా కసరత్తు
- ఇప్పటికే కమిటీ వేసిన టీజీఆర్టీఏ
హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న టూరిస్ట్ వాహనాల పన్ను విధానాన్ని తెలంగాణ ప్రభుత్వం కూడా అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నది. ఈ అంశాన్ని అధ్యయనం చేయడానికి రవాణాశాఖ ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ త్వరలో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నది. ఏపీలో ఇటీవల జారీ చేసిన జీవో ప్రకారం.. ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్(ఏఐటీపీ) కలిగిన 12 మందికిపైగా ప్రయాణికులను తీసుకెళ్లే కాంట్రాక్ట్ క్యారేజీలకు ఒకో సీటుపై త్రైమాసికంగా రూ.2,500 పన్ను విధిస్తున్నారు. తెలంగాణలోనూ ఇదేతరహా విధానం అమల్లోకి వస్తే రవాణారంగంలో గణనీయమైన మార్పులు చోటుచేసుకొనే అవకాశమున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ విషయమై ఇప్పటికే ప్రైవేట్ టూరిస్ట్ బస్సుల యజమానులు ప్రభుత్వానికి పలుమార్లు విన్నవించారు. ఏపీలో ఈ సవరణ 2026 జూన్ 25 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ విధానాన్ని తెలంగాణలోనూ అమలు చేయాలని రవాణాశాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
టూరిస్ట్ బస్సుల సంఖ్య ఎకువగా ఉన్న తెలంగాణలో ఈ విధానం అమల్లోకి వస్తే ప్రభుత్వానికి ప్రతి త్రైమాసికం కోట్ల రూపాయల అదనపు ఆదాయం వచ్చే అవకాశం ఉన్నదని రవాణాశాఖ అధికారులు భావిస్తున్నారు. వాహనం సీటింగ్ సామర్థ్యాన్ని ఆధారంగా చేసుకొని పన్ను నిర్ణయించడం వల్ల లెకలు సులభమవుతాయని అంటున్నారు. అయితే ప్రతి సీటుపై పన్ను విధించడం వల్ల పెద్ద బస్సులకు లక్షల్లో అదనపుభారం పడే అవకాశం ఉన్నది. ఒకవేళ ఆపరేటర్లు అదనపు పన్నును టికెట్ ధరలకు కలిపితే ప్రయాణ ఖర్చు పెరుగుతుంది. ప్రజలపై భారం పడుతుంది. పెద్ద కంపెనీలతో పోలిస్తే చిన్న ఆపరేటర్లపై ఆర్థిక ఒత్తిడి ఎకువగా ఉండవచ్చని భావిస్తున్నారు. పక రాష్ట్రాల్లో పన్నులు తకువగా ఉంటే, కొందరు ఆపరేటర్లు అకడే వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించే అవకాశమున్నదని పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి. కమిటీ నివేదిక ఆధారంగా తెలంగాణ ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకోనున్నది. అయితే, నేరుగా ఏపీ విధానాన్ని అమలు చేస్తుందా? లేక స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పన్ను రేట్లలో మార్పులు చేస్తుందా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉన్నది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

