రిజర్వేషన్ల పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ హాస్పిటల్లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్‌ను మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్ పరామర్శించారు. ఆయన కుటుంబసభ్యులకు ధైర్యం చెప్పారు. సాయి ఈశ్వర్‌కు మెరుగైన వైద్యం అందిచంఆలని వైద్యులను తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదేశించారు.
అనంతరం మాజీ మంత్రులు మీడియాతో మాట్లాడుతూ.. సాయి ఈశ్వర్ కుటుంబానికి ప్రభుత్వం రూ. 50 లక్షల ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. 42 శాతం రిజర్వేషన్ మిమ్మల్ని ఎవరు అడిగారని ప్రశ్నించారు. 42 శాతం రిజర్వేషన్ ఇస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత రేవంత్ సర్కార్ మోసం చేసిందని అన్నారు. అధికార పార్టీ నేతల దౌర్జన్యాలకు నిర్మల్ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్త రవీందర్ ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. నల్లగొండ జిల్లాలో సర్పంచ్ అభ్యర్థి భర్తను మంత్రి కోమటిరెడ్డి అనుచరులు కిడ్నాప్ చేసి మూత్రం తాగించారని పేర్కొన్నారు. జనాభాలో సగభాగం ఉన్న బీసీలు ఏకమై ఈ ప్రభుత్వాన్ని గద్దె దింపుతామని హెచ్చరించారు. బీసీ బిడ్డలు ఆవేశాలకు గురై బలవన్మరణాలకు పాల్పడవొద్దని కోరారు
రిజర్వేషన్ ల పరంగా బీసీలకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గాంధీ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న సాయి ఈశ్వర్ ను పరామర్శించి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పిన మాజీ మంత్రులు @YadavTalasani, @VSrinivasGoud.. అనంతరం మీడియాతో మాట్లాడారు.
సాయి ఈశ్వర్‌కు… pic.twitter.com/1vhKSAVyWh
— BRS Party (@BRSparty) December 5, 2025