హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ): ప్రముఖ పారిశ్రామికవేత్త అదానీ వ్యవహారాలపై తెలంగాణలో విచారణ జరి పి, నిజాలను వెలుగులోకి తీసుకొచ్చి సీఎం రేవంత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి గురువారం ఎక్స్ వేదికగా డిమాండ్‌చేశారు. అదానీ వ్యవహారాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్వయం గా కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సూచించారని, బీజేపీ పెద్దలు, కేంద్రమంత్రులైన కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌కు ఇదో సువర్ణావకాశమని పేర్కొన్నారు. దమ్మంటే రేవంత్‌పై విచారణ జరిపించాలని సూచించారు.‘ఏ రాష్ట్రంలో అయిన అదానీ వ్యవహారాలపై విచారణ జరిపి, ఆయన వెనుక ఉన్న కీలక వ్యక్తులను గుర్తించి, చర్యలు తీసుకోవాలని, తప్పు లు తేలితే జైలులో వేయాలి’ అన్న రాహుల్ వ్యాఖ్యల వీడియోను తన పోస్టుకు వేముల జతచేశారు.