750 ఎపిసోడ్స్.. 380 గంటలు
శాటిలైట్ ఛానళ్లతో పాటు యాప్, యూట్యూబ్‌లోనూ ప్రసారాలు
T SAT | హైదరాబాద్ : గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలకు ప్రిపేరవుతున్న అభ్యర్థుల కోసం టీ-శాట్ ప్రత్యేక పాఠాలు ప్రసారం చేయనుంది. మెయిన్స్ పరీక్షల నిమిత్తం 750 ఎపిసోడ్స్ సిద్ధం చేసింది. ఈ మేరకు టీ-శాట్ సీఈవో బోదనపల్లి వేణుగోపాల్ రెడ్డి సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు.
మెయిన్స్ పరీక్షలకు సంబంధించిన పాఠ్యాంశాలను ఆగస్టు 6వ తేదీ నుండి అక్టోబర్ 19వ తేదీ వరకు ప్రసారమయ్యే విధంగా షెడ్యూల్ ఖరారు చేశామన్నారు. అరగంట నిడివిగల పాఠ్యాంశాలను రోజుకు ఐదు గంటల చ్పొప్పున 10 ఎపిసోడ్స్ 75 రోజుల పాటు ప్రసారం కానున్నాయి. టీ-శాట్ నిపుణ ఛానల్లో సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు, అవే ప్రసారాలను మరుసటి రోజు ఉదయం 5 గంటల నుండి 10 గంటల వరకు విద్య ఛానల్ ద్వార ప్రసారం చేస్తామని వేణుగోపాల్ రెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి..
KTR | పార్టీ మారిన ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు తప్పదు : కేటీఆర్
KTR | ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు గొడ్డు కారంతో భోజనం.. మండిపడ్డ కేటీఆర్