KTR | నిజామాబాద్ : బడీడు పిల్లలకు పౌష్టికాహారం అందించడంతో పాటు విద్యాబుద్ధులు నేర్పేందుకు ఎంతో గొప్ప ఆలోచనతో తీసుకువచ్చిందే మధ్యాహ్న భోజన పథకం. కాంగ్రెస్ పాలనలో విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సైతం సక్రమంగా అందని పరిస్థితి నెలకొన్నది. పౌష్టికాహారంతో విద్యార్థుల కడుపులు నింపాల్సింది పోయింది.. కారం నూనె మెతుకులు తినాల్సిన పరిస్థితి ఎదురవుతున్నది. ఈ ఘటనలో నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని పిల్లలు తినేందుకు ఇష్టపడకపోవడంతో.. పిల్లలందరికీ గొడ్డు కారం, నూనె పోసి భోజనం పెట్టారు. ఆ గొడ్డు కారంతో కూడిన అన్నం తిని పిల్లలు కడుపు నింపుకున్నారని కేటీఆర్ పేర్కొన్నారు. మన బడి పిల్లలకు అందాల్సిన ఆహారం ఇదేనా..? అని తెలంగాణ సీఎంవోను కేటీఆర్ ప్రశ్నించారు. పాఠశాల విద్యార్థుల కోసం కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన బ్రేక్ ఫాస్ట్ స్కీంను కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి కారణం లేకుండానే రద్దు చేసిందన్నారు. ఇప్పుడు పిల్లలకు సరైన భోజనం దొరకడం లేదన్న వార్తలను చూస్తుంటే భయంకరంగా ఉంది. పాఠశాలల్లో పెడుతున్న భోజనంపై వీలైనంత త్వరగా సమీక్షించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కేటీఆర్ అభ్యర్థించారు.
నిజామాబాద్ – కోటగిరి మండలం కొత్తపల్లి పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో కారం లేని పప్పు వడ్డించారని పిల్లలు తినేందుకు ఇష్టపడలేదు.. దీంతో పిల్లలకు గొడ్డు కారం, నూనె పోసి ఇవ్వగా పిల్లలు దాంతోనే కడుపు నింపుకున్నారు.
Is this the kind of atrocious food our school children deserve… pic.twitter.com/gjLwWFcKqV
— KTR (@KTRBRS) August 5, 2024