శనివారం 05 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 14:54:19

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

నిజాయితీ చాటుకున్న ఆర్టీసీ డ్రైవర్

సూర్యాపేట : సూర్యాపేట డిపో పరిధిలో పనిచేసే ఆర్టీసీ డ్రైవర్‌ కోటయ్య నిజాయితీ చాటుకున్నాడు. సూర్యాపేట నుంచి హనుమకొండ వెళ్లే బస్సు లో ప్రయాణికుడు పర్స్ పోగొట్టుకున్నాడు. పర్స్‌ను గుర్తించి కోటయ్య పర్సుతోపాటు అందులోని రూ. 9,060 నగదును అసిస్టెంట్ మేనేజర్‌కు అందించాడు. పర్సులో గుర్తింపుకార్డుల ఆధారంగా పర్సు పొగొట్టుకున్నది ఏపూరు గ్రామానికి చెందిన సంపత్ గా గుర్తించి అతనికి అందించారు. నిజాయితీని చాటుకున్న కోటయ్యను డిపో మేనేజర్ అసిస్టెంట్ మేనేజర్‌తోపాటు ఉద్యోగులు అభినందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.