ఒడువని ముచ్చటకు మరో ఆరంభం!

అందరి చూపులు ఆకాశం వంక ఉంటే
అతనొక్కడు మాత్రం
నేల వంక చూసాడు
చుట్టూ వున్న జనమంతా
కోనసీమ సినిమా అందాలను చూస్తుంటే
అతనొక్కడు మాత్రమే
తాను పుట్టిన మట్టి నెర్రెల వైపు దిగులుగా చూసాడు
కథలన్నీ కాశీకే పోతాయంటారు
కాశీ విశ్వవిద్యాలయంలో
తెలంగాణ కథకు
ముగింపు దొరుకుతుందేమో
అని నిరంతరం వెతికాడు
విద్యార్జనతో పాటు తెలంగాణ గర్జనను కూడా నేర్చాడు
తెలంగాణా అంటే..
ఓ ఒడువని ముచ్చట అని అర్థం చేసుకున్నాడు
భూమి పుత్రుడు కదా!
భూమి బిడ్డల గోసకు చలించి తెలంగాణ పిలుపునకు భూమికను సిద్ధం చేసాడు
మెదళ్ళను కదిలించే అక్షరాన్ని
జ్ఞానాన్ని అందించే ఉపన్యాసాన్ని
పోరాటం చేసే ఆత్మగౌరవ రాజకీయాన్ని
కదిలించి అదిలించి
అందరిలో చలనం తెచ్చాడు!
బీద రైతు వాటా నీళ్లు
మధ్యతరగతి సంసారి నిధులు
ఉన్నత విద్యావంతుడి ఉద్యోగం
గాలిలోనే ఎలా మాయమవుతున్నాయో తేల్చాడు!
కన్నీటి భాషను, మనసు యాసను,
న్యాయపు బాటను ఎరిగిన యాత్రికుడు కదా!
కరువు గుండెలను, బీద దేహాలను
వివక్ష వడగాలులను
అనుభవించిన మనిషి కదా!
ఇంకానా.. ఇక చాలనుకున్నాడు
నా ప్రజలకు ఈ అణచివేతలు
ఇక చాలని పంతం పట్టిండు!
ఓ జ్ఞాన జ్వాల..
జయశంకర్ సారు!
మరో పెను వాయువు..
కేసీఆర్ జోరు!
ఒకరి ఆలోచన.. మరొకరి ఆచరణ
వారివెంట సకలజనుల అనుసరణ
ఫలితం ప్రత్యేక తెలంగాణ!
జయశంకర్ సారూ!
మిము కన్న తెలంగాణ తల్లి
ఇప్పుడు సగర్వంగా తల ఎత్తుకుని
నిలబడింది
ఒక్కసారి మా కోసం రారాదూ?!
బంగారు కలలు సాకారమైన
బడుగు బతుకు ఆనందాల్ని చూద్దురు
అలుగు దుంకుతున్న చెరువుల
చప్పుళ్ళని
చెవి దోనెలో వంపుకొందురు
ధాన్యపు రాసులతో ఆర్థిక ముల్లెలైన
పల్లెల స్వయం సమృద్ధిని గానం చేద్దురు
కులవృత్తులకు దక్కిన గౌరవాన్ని
గుండెలకు హత్తుకుందురు!
రా సారూ…!
తెలంగాణ ప్రగతిహారాలని మీ మెడలో వేస్తాము
మీరు నాటివెళ్లిన ఆత్మగౌరవ మొక్కలు
ఇప్పుడు వృక్షాలై పాడుతున్న
సంక్షేమగానాన్ని వినిపిస్తాము.!
సారూ.. మళ్ళీ ఓ సారి మా కోసం రారాదూ..
నిజమైన మీ స్వప్నాన్ని చూడటానికి..
మీ ఒడువని ముచ్చటను
సరికొత్తగా చెప్పటానికి..!!
- ఐనంపూడి శ్రీలక్ష్మి ,99899 28562
Read Today's Latest Editpage News in Telugu and Telugu News
- Tags
RELATED ARTICLES
తాజా వార్తలు
Amazon Jobs | ఆ చట్టం అమల్లోకి వస్తే.. అమెజాన్‌లో మళ్లీ ఉద్యోగాల కోత.. ?
smit machchhar | ఆ విషయం నాకు నిజంగా తెలియదు : కెప్టెన్ స్మిత్ మచ్చర్
Congress Leaders | బతుకమ్మ పండుగ వేళ.. కాంగ్రెస్ నేతల డిష్యుం డిష్యుం
Fake Number Plates | రూల్స్ బ్రేక్ చేసేందుకు.. ఫేక్ నంబర్ ప్లేట్లపై పోలీసుల ఫోకస్
Devaragattu Banni Utsavam | దసరా వేళ కర్రల సమరం.. దేవరగట్టు బన్నీ ఉత్సవం వెనుక అసలు కథ ఇదే!
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

