Rythu Bharosa | హైదరాబాద్, జనవరి 25(నమస్తే తెలంగాణ): రైతుభరోసాకు సంబంధించి ఇంకా సాగు లేక్క తేలనేలేదు. సాగు యో గ్యంకాని భూముల లెక్కలు తేల్చేందుకు ప్రభుత్వం చేపట్టిన సర్వే ఇంకా పూర్తికాలేదు. ఈ నెల 26 నుంచి రైతుభరోసా పంపిణీ ప్రారంభమవుతుందా? లేదా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వారం రోజులుగా రెవెన్యూ, వ్యవసాయ శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే చేస్తున్నారు. ఈ సర్వే పూర్తయి.. ఆ జాబి తా ప్రభుత్వానికి వస్తే గానీ ఏం చేయలేని పరిస్థితి ఉన్నదని అధికారులు చెప్తున్నా రు.
ఆ సర్వే ఆధారంగా భూములను గుర్తించి వాటికి రైతుభరోసా రాకుండా ఆన్లైన్లో ఫ్రీజ్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. ఈ సీజన్‌కు ఎలాంటి కోతలు లేకుండా అమలుచేస్తే 153 లక్షల ఎకరాలకు రైతుభరోసా ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం రూ.9180 కోట్లు అవసరం అవుతాయి. అయితే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాత్రం రూ.8,400 కోట్ల వరకు రైతుభరోసా ఇస్తామని వివిధ సందర్భాల్లో ప్రకటించారు.