హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం 25 వేల కోట్ల అవినీతికి పాల్పడిందంటూ గతంలో కేటీఆర్ చేసిన ఆరోపణలకు సంబంధించిన కేసులో ఆయనతోపాటు రాష్ట్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు సుప్రీం నోటీసులు ఇచ్చింది. ఇదే కేసుకు సంబంధించి గతంలో హైకోర్టు కేటీఆర్కు అనుకూలంగా తీర్పునివ్వగా, దానిని సవాల్ చేస్తూ కాంగ్రెస్ నేత ఆత్రం సుగుణ సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. ఆమె పిటిషన్పై సమాధానం చెప్పాలని ప్రభుత్వానికి, కేటీఆర్కు నోటీసులు జారీ చేసింది.