హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు దాఖలు చేసుకున్న పిటిషన్‌పై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది. ఈ కేసు దర్యాప్తునకు ప్రభాకర్‌రావు సహకరిస్తున్నారని, ఇప్పటికే 10 సార్లు సిట్ విచారణకు హాజరయ్యారని ఆయన తరఫు న్యాయవాది శేషాద్రినాయుడు కోర్టుకు విన్నవించారు. వాదనలు విన్న జస్టిస్ నాగరత్న ధర్మాసనం.. తదుపరి విచారణను 22 సెప్టెంబర్‌కు వాయిదా వేశారు.