Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి (Revanth Reddy) సుప్రీం కోర్టులో ఊరట లభించింది. ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా దాఖలైన పరువు నష్టం దావా కేసును సర్వోన్నత న్యాయస్థానం కొట్టేవేసింది. లోక్సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తుందంటూ రేవంత్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. దీనిపై రాష్ట్ర బీజేపీ పరువునష్టం పిటిషన్ను సుప్రీంకోర్టులో దాఖలు చేసింది. ఇరు పక్షాల వాదనలు విన్న సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్ను కొట్టివేసింది.
గతంలో ఇదే విషయమై బీజేపీ పిటిషన్ను హైకోర్టు కూడా డిస్మిస్ చేసింది. అయితే హైకోర్టు ఉత్తర్వులను సుప్రీంకోర్టులో బీజేపీ సవాల్ చేసింది. ఈ పిటిషన్ను డిస్మిస్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీఆర్ గవాయ్ ధర్మాసనం.. రాజకీయ పరమైన అంశాల్లో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది.