యాదాద్రి, ఆగస్టు 24: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామివారికి సుప్రభాత సేవ వైభవంగా సాగింది. బుధవా రం తెల్లవారుజామున అర్చకులు సుప్రభాతాన్ని ఆలపించి స్వామివారిని మే ల్కొలిపారు. నిత్య తిరుకల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు.
శ్రావణలక్ష్మీ కోటి కుంకుమార్చన 27వ రోజుకు చేరింది. స్వామివారి ఖజానాకు రూ.22,58,871 ఆదాయం సమకూరిందని ఆలయ ఈవో ఎన్ గీత తెలిపారు. స్వామివారిని విశ్రాంత న్యాయమూర్తి రాజశేఖర్‌రెడ్డి, శాసన మండలి మాజీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. హైదరాబాద్ బోయినపల్లికి చెందిన బంగారు కృష్ణమూర్తి-మంజుల దంపతులు స్వామివారికి 900 గ్రాముల 2 వెండి కలశాలను బహూకరించారు.