జోగులాంబ గద్వాల : ప్రజలకు అండగా గులాబీ జెండా ఎల్లప్పుడూ ఉంటుందని, ప్రతి కార్యకర్తను పార్టీ కాపాడుకొంటుందని వ్యవసాయ శాఖ మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ( Singireddy Niranjan Reddy) అన్నారు. ఈనెల 27న వరంగల్లో ( Warangal ) జరిగే రజతోత్సవ సభకు భారీగా జన సమీకరణలో భాగంగా శనివారం కేటి దొడ్డి మండలం పా గుంట గ్రామం వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో ఏర్పాటుచేసిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ప్రతి గ్రామం నుంచి గులాబీ జాతరకు దండుగా కదలి రావాలని పిలుపునిచ్చారు. సభకు వచ్చే ముందు ప్రతి గ్రామంలో గులాబీ జెండా ఎగురవేయాలన్నారు. రాష్ట్ర ఏర్పాటు నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్( KCR ) పాటుపడ్డారని వివరించారు. రాష్ట్ర ఏర్పాటు కోసం పదవులను సైతం లెక్కచేయక చావు దాక వెళ్లి తెలంగాణను సాధించిన గొప్ప వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు.
కొట్లాడి సాధించుకున్న రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని లక్ష్యంతో అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారని తెలిఈపారు. 25 సంవత్సరాల బీఆర్ఎస్ ప్రస్థానాన్ని రజతోత్సవ సభ ద్వారా భావితరాలకు స్ఫూర్తి కలిగించేందుకు సభను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేసీఆర్ విలువ బీఆర్ఎస్ అవసరం ప్రస్తుతం ప్రజలకు తెలిసి వచ్చిందన్నారు.
బీఆర్ఎస్లో చేరిక
ఉమిత్యాల తండాకు చెందిన కొంతమంది యువకులు మాజీ మంత్రి సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ సమావేశంలో నాయకులు బాస్ హనుమంతు నాయుడు, నాగరిదొడ్డి వెంకట రాములు, కురువ పల్లయ్య ,చక్రధరరావు, శ్రీరాములు , మోనేష్ తదితరులు పాల్గొన్నారు .