హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా వారంరోజుల్లో 2,764 మంది ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులకు సుమారు రూ. 28.50 కోట్లు విడుదల చేసినట్టు హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం శనివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. లబ్ధిదారుల ఆధార్‌నంబర్ బ్యాంక్ అకౌంట్‌కు అనుసంధానించకపోవడం, పేర్లలో తేడాలు ఉండటం, అప్లోడ్ చేసిన ఫొటోలు సరిగా లేకపోవడం తదితర కారణాలతో బిల్లుల విడుదల్లో జాప్యం జరుగుతున్నదని తెలిపారు.
ప్రజాప్రాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా చేపట్టిన 99 రోజుల ప్రత్యేక డ్రైవ్‌లో మొదటి వారం రోజులపాటు పెండింగ్‌లోని బిల్లులు క్లియర్ చేసినట్టు పేర్కొన్నారు. ప్రస్తుతం క్లియర్ చేసిన బిల్లుల్లో ఎల్-3 జాబితాలోని 1200 మందికి రూ.12.06 కోట్లు, బ్యాంక్ వద్ద పేమంట్ ఫెయిల్ అయిన 653 మందికి రూ. 7 కోట్లు, పలు అభ్యంతరాలతో పెండింగ్‌లోని 911 మందికి రూ. 9.40 కోట్లు ఉన్నట్టు తెలిపారు.